కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై ఒక్కో రంగం వారు... విభిన్న శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. పాటలు, కవితలు, నృత్యాలు, చిత్రాల ద్వారా కొందరు...వివిధ వేషధారణలో మరికొందరు చైతన్యం కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పోలీసుల ఆధ్వర్యంలో అనపర్తికి చెందిన కళాకారులు కరోనా వేషధారణలో వినూత్నంగా అవగాహన కల్పించారు. కారణం లేకుండా రోడ్లపైకి రావద్దంటూ పోలీసులకు సహకరించాలని కోరారు.
విభిన్నశైలిలో కరోనా వైరస్‌పై అవగాహన - జగ్గంపేటలో కరోనాపై అవగాహన
కరోనాపై అవగాహన కల్పించేందుకు కళాకారులు కృషి చేస్తున్నారు. ఒక్కో రంగం వారు ఒక్కో విధంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పోలీసుల ఆధ్వర్యంలో అనపర్తికి చెందిన కళాకారులు కరోనా వేషధారణలో వినూత్నంగా అవగాహన కల్పించారు.

విభిన్నశైలిలో కరోనా వైరస్‌పై అవగాహన