ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ సైకత శిల్పాన్ని రూపొందించారు. శుభ్రత పాటించి కరోనా జయిద్దామని సందేశమిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోరు తాకవద్దని.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎనిమిది గంటలు కష్టపడి రూపొందించిన ఈ సైకత శిల్పం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది.
సైకత శిల్పంతో కరోనాపై అవగాహన - కరోనాపై అవగాహన తాజా వార్తలు
ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనాపై సైకత శిల్పం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సైకత శిల్పి. శుభ్రత పాటించి కరోనాను జయిద్దామన్నా సందేశమిచ్చారు రంగంపేటకు చెందిన శ్రీనివాస్. ఈ శిల్పం అందరినీ ఆకర్షిస్తోంది.
తూర్పుగోదావరిలో సైకత శిల్పంతో కరోనాపై అవగాహన