కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో అల్పాదాయ వర్గాలు, పేదలు, కూలీల పాట్లు అన్నీ ఇన్నీ కావు. లాక్డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. బతుకు చక్రం ఆగిపోవడం వల్ల ఉపాధి లేక.. పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక బతుకు భారమైందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఆటో ఆగింది.. బతుకు భారమైంది..!
లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, ఉపాధి కూలీలు, రోజూ పనిచేస్తే తప్ప పూట గడవని వారందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటో డ్రైవర్లు సైతం తమ ఉపాధిని పూర్తిగా కోల్పోయారు. ఉపాధి లేక తమ కుటుంబ పోషణ భారంగా మారిందని.. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
లాక్డౌన్ వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు