తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి గ్రామానికి చెందిన పిల్లా సాయి (19) తుంగపాడు వైపు నుంచి ద్వారపూడి వస్తుండగా ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని ఎస్ఐ పి.దొరరాజు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.దొరరాజు తెలిపారు.
విషాదం.. ఆటో ఢీకొని యువకుడు మృతి - mandapeta latest news
ఆటో ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా మెడపాడు- తుంగపాడు రోడ్డులో జరిగింది.
ఆటో ఢీ.. యువకుడు మృతి