ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 5:02 AM IST

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా వాసికి కరోనా వైరస్?

తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇటీవలే దక్షిణ కొరియా వెళ్లి వచ్చారు. ముందు జాగ్రత్తగా బాధితుడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతని కుటుంబసభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

carona
carona

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. విధుల్లో భాగంగా అతను ఇటీవల దక్షిణకొరియా వెళ్లాడు. ఆ దేశం నుంచి వారం క్రితమే వాడపాలెం చేరుకున్నాడు. దక్షిణకొరియా నుంచి మొదటగా హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం వాడపాలెంకు వచ్చి మూడ్రోజులపాటు ఉన్నారు. అతనికి కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తూ హైదరాబాద్‌ నుంచి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు అధికారులు సమాచారం అందించారు. అప్రమత్తమైన జిల్లా యంత్రాగం మంగళవారం అర్ధరాత్రి వాడపాలెం వెళ్లి ఆరా తీసింది. బాధితుడు వాడపాలెం నుంచి ముమ్మిడివరం మండలంలోని గోదసివారిపాలెంలో అత్తగారింటికి వెళ్లినట్లు తెలుసుకుని... అక్కడికి చేరుకున్నారు. బాధితుడికి కరోనా సోకిందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతని భార్య, అత్తగారింట్లోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details