ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారీలో బ్లాస్టింగ్​ను అడ్డుకున్న అధికారులు - తూర్పుగోదావరి జిల్లా తాాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో అనధికారికంగా క్వారీలో రిగ్ ద్వారా పేలుళ్లను నిర్వహిస్తున్న వారిని ఏలేరు రిజర్వాయర్ అధికారులు అడ్డుకున్నారు. పనులను నిలిపివేయాలంటూ క్వారీ యాజమానులకు ఆదేశాలు జారీ చేశారు.

క్వారీలో గ్రానైట్ పేలుళ్లు
క్వారీలో గ్రానైట్ పేలుళ్లు

By

Published : Mar 1, 2021, 6:33 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేరు రిజర్వాయరు పరిధిలో రిగ్ ద్వారా పేలుళ్లను నిర్వహిస్తున్న క్వారీ యాజమాన్యాన్ని​ అధికారులు అడ్డుకున్నారు. ఏలేరు నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు, పేలుళ్లు చేపట్టరాదనే నిబందనలు ఉన్నప్పటికీ కొందరు అనధికార బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. బ్లాస్టింగ్ ద్వారా వచ్చిన నల్ల రాయిని ఇతర ప్రాంతాల క్వారీలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.

బ్లాస్టింగ్​కు పాల్పడటమే కాకుండా ఏలేరు రిజర్వాయర్​ను రాళ్లు, మట్టితో నింపుతున్నారని...అందుకే తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని క్వారీ యాజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఏలేరు రిజర్వాయర్ అధికారులు డీఈ అనందకుమార్, జేఈ భవానీ పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నా పర్యటనతో శాంతి భద్రతల సమస్య తలెత్తదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details