తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సుమారు 178 ఆడిట్ రికార్డులు మాయమయ్యాయి. దేవస్థానానికి సంబంధించి 1989-2018 మధ్య రూ. 58.56 కోట్ల విలువైన 482 అభ్యంతరాలు పెండింగులో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 2002 ముందు దేవస్థానం రికార్డులు ఎక్కడ సక్రమంగా లేకపోవటం గమనార్హం. అనేక ప్రధాన దస్త్రాలు భద్రపరిచే వ్యవస్థ లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రికార్డులు కనిపంచకపోవడంతో రూ. 16.53 కోట్ల లెక్కల సంగతి ఏంటనే సందేహాలు నెలకొన్నాయి.
అన్నవరంలో ఆడిట్ రికార్డులు మాయం... రూ.16.53 కోట్ల సంగతేంటి? - eastb godawari dist
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో 178 ఆడిట్ రికార్డులు మాయమయ్యాయి. ఈ రికార్డుల మాయంతో రూ. 16.53 కోట్లలకు లెక్కలు చెప్పేదెవరనే సందేహం నెలకొంది.
అన్నవరంలో రూ.16.53 కోట్ల విలువైన ఆడిట్ రికార్డులు మాయం