రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా పెరగటంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తెచ్చి లాభాలు పొందుతున్నారు. మరికొంతమంది నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వెలిచేరులోని గోదావరి ఇసుక తిప్పలో దాచి ఉంచిన 7 వేల 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఆత్రేయపురంలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు - తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో నాటుసారా స్థావరాలపై దాడులు
రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంతో నాటు సారాకు డిమాండ్ పెరిగింది. దీంతో నాటుసారాను తయారు చేసేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో తయారీదారులు ఎవరికీ అనుమానం రాకుండా ఏకంగా గోదావరి ఇసుక తిప్పలో గొయ్యిలు తీసి బెల్లం ఊటలను నిల్వ ఉంచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఊటలను ధ్వసం చేశారు.
ఆత్రేయపురంలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు