తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో దారుణం జరిగింది. సారా అమ్మకాలలో మొదలైన వర్గ పోరు దాడులకు దారి తీసింది. ఈ దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కోడి కత్తులతో దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు
తూర్పు గోదావరి జిల్లా పెద్దనాపల్లిలో దారుణం జరిగింది. సారా వ్యాపారం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరువర్గాలు కోడి కత్తులతో దాడి చేసుకోగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెద్దనాపలిలో నాటు సారా వ్యాపారంపై పోలీసులకు సమాచారం అందిస్తున్నారని... ఒక వర్గం వారు మరొక వర్గంతో దాడికి దిగారు. ఇరు వర్గాల మధ్య కోడి కత్తులతో జరిగిన ఘర్షణలో సూరిశెట్టి లోవరాజు, వీరబాబు, కాశీ, సుబ్రహ్మణ్యంకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టారు. గ్రామంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:ఆస్తిపై మరదలు కన్ను.. బావ హత్యకు పథకం.. చివరికి..!