తూర్పుగోదావరి జిల్లా కొత్త కాకినాడలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పై కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గడగలా రాజు, సురేష్ ఇద్దరూ పెయింటింగ్ పని చేస్తారు. ఇద్దరూ సోమవారం రాత్రి మద్యం సేవించారు. తర్వాత ఇంటి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సురేష్, రాజుకు ఫోన్ చేసి బయటకి రమ్మని పిలిచాడు. బయటకు రాగానే సురేష్ వద్దనున్న చాకుతో రాజుపై దాడి చేశాడు.
మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి - వ్యక్తిపై కత్తితో దాడి
తూర్పుగోదావరి జిల్లా కొత్త కాకినాడలో మద్యం మత్తులో వ్యక్తి పై స్నేహితుడు కత్తితో దాడి చేశాడు. వ్యక్తిని కుటుంబ సభ్యులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు.
మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. మద్యం మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పేకాట శిబిరంపై పోలీసుల దాడి... భవనంపై నుంచి దూకి ఒకరు మృతి