తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం.. చెయ్యేరులోని వడ్డిపేటలో దారుణం జరిగింది. యాళ్ళ అర్జున్ రావు కుటుంబ సభ్యులపై.. గుత్తుల శ్రీనివాసరావు, ముడుదొడ్డి చిన్న శ్రీను ,గుత్తాల లోవరాజు, కూరాటి నాగరాజులు మారణాయుధాలతో దాడి చేశారు. అర్జున్‌రావు తలపై, కాళ్ల మీద బలంగా కొట్టారు. తండ్రిని కొట్టొద్దని అడ్డు వెళ్లిన కుమార్తె నాగలక్ష్మి పైనా... కిరాతకంగా దాడిచేశారు. మహిళ అని చూడకుండా ఆమె దుస్తులు చింపివేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు.
మద్యం మత్తులో వీరు చేసిన హంగామాకు స్థానికులు భయపడిపోయారు. బాధితుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. రక్తం మడుగులో ఉన్న బాధితులను స్థానికులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.