పుదుచ్చేరిలో శాసన సభ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనలు అనుసరిస్తూ 60 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సాగుతోంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.. ఓటింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు తీర గ్రామమైన సావిత్రినగర్కు చేరుకోగా.. అప్పటికే అక్కడ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉన్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉందని.. పోలీసులు అప్రమత్తమై ఎవరూ పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
యానాంలో భారీ భద్రత నడుమ.. ప్రశాంతంగా ఓటింగ్ - ప్రశాంతంగా యానంలో పోలింగ్ వార్తలు
కేంద్ర పాలిత ప్రాంతం.. పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీకి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కేంద్రపాలిత యానాంలో 11 గంటల సమయానికి 35 శాతం ఓటింగ్ నమోదు అయిందని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు.
![యానాంలో భారీ భద్రత నడుమ.. ప్రశాంతంగా ఓటింగ్ యానంలో ప్రశాంతంగా ఓటింగ్..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11300284-578-11300284-1617703111668.jpg)
యానంలో ప్రశాంతంగా ఓటింగ్..