ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాయత్రి-4 ఇసుక ర్యాంపును పరిశీలించిన ఏఎస్పీ రమాదేవి - ASP Ramadevi examines sand ramps at dhavaleshvaram

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ సమీపంలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తోడేస్తున్న వైనంపై ఈటీవీ భారత్-ఈనాడు ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు.

ASP Ramadevi examines sand ramps at east godavari district
గాయత్రి-4 ఇసుక ర్యాంపును పరిశీలించిన ఏఎస్పీ రమాదేవి

By

Published : Jul 4, 2020, 3:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ సమీపంలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తోడేస్తున్న వైనంపై అధికారులు స్పందించారు. గాయత్రి-4 ఇసుక ర్యాంపును ఎస్​ఈబీ ఏఎస్పీ రమాదేవి పరిశీలించారు.

ఇసుక తవ్వకాలపై సొసైటీ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో కలిసి గోదావరిలో పర్యటించారు. ఈ బృందం వచ్చే సరికే ర్యాంపు వద్ద డ్రెడ్జింగ్ కు సంబంధించిన ఇంజిన్లు, గొట్టాలు అమర్చిన పడవలను అక్రమార్కులు తరలించారు. దీనిపై మాట్లాడేందుకు ఏఎస్పీ రమాదేవి నిరాకరించారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​ : తుని మార్కెట్​ యార్డ్​ మూసివేత

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details