తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండంలో ఆశావర్కర్లు ఆందోళన చేశారు. తోటి ఉద్యోగిపై కాట్రావులపల్లి గ్రామానికి చెందిన కుటుంబం దాడి చేసిందని ఆరోపించారు. రెడ్ జోన్ లో ఉన్న పిఠాపురం గ్రామానికి చెందిన వ్యక్తి... సూరంపాలెం వచ్చింది అని చెప్పారు. ఆమెను తిరిగి పిఠాపురం పంపాలి అని చెప్పినందుకే ఆమె బంధువులు దాడి చేశారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆశా కార్యకర్తపై దాడి.. సహోద్యోగుల ఆందోళన - corona news in east godavari dst'
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ కార్యకర్తలు నిరసనకు దిగారు. కోవిడ్ - 19 విధుల్లో భాగంగా సూరంపాలెంలో సర్వే నిర్వహిస్తున్న చంద్రకళ అనే ఆశ కార్యక్రతపై పై గ్రామానికి చెందిన ఓ కుటుంబం దాడి చేసిందని ఆరోపించారు.

asha workers protest in east godavari dst