తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఆశావర్కర్లు 11 మండలాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కొంతమంది ఆశావర్కర్లకు 2019 జనవరి నెల నుంచి నేటి వరకు వేతనాలు అందడం లేదని రాష్ట్ర ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు మట్ల వాణిశ్రీ తెలిపారు. దీంతో ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిర్మూలనకు పనిచేస్తున్న ఆశావర్కర్లకు 25 వేల రూపాయలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలీం కోట రమణమ్మ, జాయింట్ సెక్రెటరీ కొమరం చెళ్ళాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోరుతూ ఆశావర్కర్ల ఆందోళన - Asha workers at east godavari news
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాలోని 11 మండలాల్లోని ఆశావర్కర్లు నిరసన చేపట్టారు. కరోనా విధుల్లో పాల్గొన్నవారికి రూ. 25 వేలు ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్లు ఆందోళన