ఆశా వర్కర్లకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ... కాకినాడలో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటఆందోళనకు దిగారు. కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రూ.10 వేల ప్రత్యేక అలవెన్స్ కల్పించాలని కోరారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు.
'కరోనా విధుల్లో పనిచేస్తున్న ఆశావర్కర్లను పట్టించుకోండి' - asha workers protest news in kakinada
తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ... ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ధర్నా చేపట్టారు. కొవిడ్-19 విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
కాకినాడలో ఆశావర్కర్ల ఆందోళన