రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రహహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఉదయం నుంచి ఇప్పటివరకు సుమారు 8లక్షల 77వేల క్యూసెక్కుల వరద తగ్గినట్లు అధికారులు చెప్పారు. కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 10.2 అడుగుల నీటిమట్టం ఉంది.
డెల్టా కాల్వలకు 12వేల6వందలు క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 8లక్షల క్యూసెక్కులకు పైగా వరదని సముద్రంలోకి వదిలారు. కోనసీమలో వైనతేయ వశిష్ట గౌతమి గోదావరి నదీ పాయల్లో వరద జోరు తగ్గింది. కొన్ని లంక గ్రామాలకు రాకపోకలకు సులువైంది.