ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికురాలిగా.. గ్రామ ప్రథమ మహిళ - she is the first lady of the village east Godavari district

ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళ.. ఒకప్పటి ఆ గ్రామ ప్రథమ మహిళ. ఏడాదికి రూ.50 లక్షల ఆదాయం కలిగి, నర్సరీలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కడియం గ్రామానికి ఐదేళ్లు సర్పంచిగా పని చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మాజీ సర్పంచి అయిన ఈమె ఇప్పుడు దీనస్థితిలో ఉంది.

As a sanitation worker
As a sanitation worker

By

Published : Feb 12, 2021, 7:07 AM IST

2001 నుంచి 2006 వరకు కడియం సర్పంచిగా సేవలందించిన బొచ్చా నర్సమ్మ నేడు అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా బతుకీడిస్తున్నారు. పదవి చేపట్టగానే నాలుగైదు తరాలకు సరిపడా కూడబెట్టుకునే నేతలకు భిన్నంగా.. ఆమె ఐదేళ్లపాటు నిస్వార్థంగా పనిచేసినట్లు గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. భర్త రాజారావు అదే పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేవారు.

ఆరేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన ఉద్యోగాన్ని కుమారుడు సుశీలరావుకు ఇచ్చారు. కుమారుడు ఇటీవల కరోనా బారినపడి మరణించాడు. ప్రస్తుతం నర్సమ్మ కడియం పంచాయతీలో పారిశుద్ధ్య పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తన భర్తకు పంచాయతీ నుంచి రావాల్సిన వేతనాలు రూ.లక్ష, మరణానంతర ప్రయోజనాలు రూ.10లక్షల వరకు బకాయి ఉన్నాయని, వాటిని అందించి ఆర్థికంగా ఆదుకోవాలని ఈ మాజీ సర్పంచి కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details