ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ బాధితుల కోసం.. ఆర్యవైశ్య సంఘం ఆక్సిజన్ సాయం - కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆక్సిజన్ సాయం

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఏరియా ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందిచేందుకు.. స్థానిక ఆర్యవైశ్య సంఘం సభ్యులు ముందుకొచ్చారు. పలువురు దాతల సాయంతో 10 సిలిండర్లను 20 రోజుల పాటు పంపిణీ చేస్తామన్నారు.

kothapeta area hospital, kothepeta arya vysya association help
కొత్తపేట ఏరియా ఆస్పత్రి, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సాయం

By

Published : May 12, 2021, 3:56 PM IST

కరోనా రెండో దశ విజృంభణతో రోగులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతుండటం చూసి.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. ఏరియా ఆస్పత్రికి ప్రతీరోజూ 40 కేజీల ఆక్సిజన్ సిలెండర్లు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్ జి.డి. కిషోర్ బాబు, ఎంపీడీఓ కె.రత్నకుమారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దాతల సహకారంతో 10 ఆక్సిజన్ సిలెండర్లను 20 రోజుల పాటు పంపిణీ చేస్తామని సంఘం సభ్యుడు పవన్ తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే మరింత మెరుగ్గా సేవలు అందించగలమన్నారు. వారి సాయాన్ని అధికారులు అభినందించారు. సభ్యులు ఎస్.జగదీష్, కొత్త జగన్నాథరావు, పి.బాపన్న, కొత్త చినబాబు, ఎస్.రామారావు, ముత్యాల వీరభద్రరావు, విళ్ల మారుతీ ప్రసాద్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details