ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాచపల్లిలో "అరుణాచలేశ్వర" ఆలయం - arunachaleswara temple in ramana maharshi Ashram rachapalli pattipadu mandalam east godavari district

రమణమహర్షి బోధనపట్ల ఆకర్షితులైన స్వామి రామానంద ఏకంగా ఆయనకు ఆలయం నిర్మించాడు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన స్వామి రామానంద... రమణమహర్షి బోధనలు ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. భజనలు, సేవా కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రచారం చేస్తున్నారు.

arunachaleswara temple in rachapalli ramanamaharshi Ashram
రాచపల్లిలో "అరుణాచలేశ్వర" ఆలయం

By

Published : Jan 3, 2020, 4:06 PM IST

Updated : Jun 27, 2022, 11:19 AM IST

దుఃఖం మనసుకే గాని ఆత్మకు కాదని ఆత్మజ్ఞానం ప్రబోధించారు రమణమహర్షి. ఆ బోధనపట్ల ఆకర్షితులైన స్వామి రామానంద ఆయనకు ఆలయం నిర్మించాడు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన స్వామి రామానంద... రమణమహర్షి భక్తుడు. రెండు దశాబ్దాల కిందట రమణ మహర్షి బోధనలు ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని నిర్మించాడు. ఇటీవల రమణమహర్షి 140 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

భజనలు, సేవాకార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రచారం చేస్తున్నారు ఆశ్రమ నిర్వాహకులు. విద్యార్థులకు ఉపకార వేతనాలు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. పచ్చని మొక్కలతో ఆశ్రమ పరిసరాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ గోశాల, ఆధ్యాత్మిక గ్రంథాలతో ఉన్న గ్రంథాలయం ప్రత్యేక ఆకర్షణ. ఆశ్రమానికి వచ్చే భక్తులకు... సాధకులు భక్తి ప్రవచనాలపై అవగాహన కల్పిస్తారు. ఆలయ పరిసరాల్లో ఆరు కోట్ల రూపాయలతో అరుణాచలేశ్వర ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Last Updated : Jun 27, 2022, 11:19 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details