Sand Sculpture of Lord Shiva on Maha Shivratri 2022: మహాశివరాత్రిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో శివపార్వతుల సైకత శిల్పం రూపుదిద్దుకుంది. రంగంపేటకు చెందిన ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్.. 15 గంటలపాటు శ్రమించి శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. 'శివతత్వం తెలుసుకో... నిన్ను నీవు దిద్దుకో'... అన్న నినాదంతో పార్వతీ పరమేశ్వరుల చుట్టూ శివలింగాలను తీర్చిదిద్దారు. ఐదు యూనిట్ల ఇసుక ఉపయోగించి 20 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తుతో చేసిన ఈ సైకత శిల్పాన్ని చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండి:
Sand Sculpture of Lord Shiva: రంగంపేటలో శివపార్వతుల సైకతశిల్పం.. - created sand sculpture of Lord Shiva on at rangampet
Sand Sculpture of Lord Shiva on at Rangampet: మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ సైకతశిల్పి దేవిన శ్రీనివాస్.. శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని ఈ శిల్పాన్ని చూసేందుకు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు.
శివ పార్వతుల సైకత శిల్పం