లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లాలోని వృత్తి, డప్పు కళాకారులు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వివిధ ప్రదర్శనలతో వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లాలో డప్పు, గరగ, తాసాలు, నాదస్వరం, డోలు కళాకారులు 5వేల మంది వరకు ఉన్నారని.., మార్చి నెల నుంచి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు కళాకారుల ప్రతినిధులు తెలిపారు. ప్రతి కళాకారుడికి 10వేల రూపాయలతో పాటు 50కిలోల బియ్యం అందించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
తూర్పుగోదావరి కలెక్టరేట్ ఎదుట కళాకారుల వినూత్న నిరసన - protest of dappu men in east godavari dst
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కళాకారులు నిరసన చేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న వివిధ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10వేల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
![తూర్పుగోదావరి కలెక్టరేట్ ఎదుట కళాకారుల వినూత్న నిరసన art workers demands in front of east godavari dst collector office abut loss of their income due to lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7626062-173-7626062-1592219875249.jpg)
art workers demands in front of east godavari dst collector office abut loss of their income due to lock down