కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొంత కాలంగా ఆలయ దర్శనాలు నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపుల ప్రకారం... నిబంధనలతో కూడిన దర్శనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కారణంగా.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయ సిబ్బంది, గ్రామస్తులకు దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. ఆన్లైన్ విధానంలో దర్శనం టోకెన్లను ఇవ్వనున్నట్లు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.