తూర్పుగోదావరి జిల్లా అధికారులు.. రేపు జరగనున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. అమలాపురం డివిజన్‌లో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ కౌశిక్ పరిశీలించారు. సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. అమలాపురం డివిజన్‌లో మొత్తం 259 సర్పంచి, 2065లకు ఆదివారం పోలింగ్ జరగనుంది. సుమారు 15 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2400 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
ఎన్నికల పర్యవేక్షణాధికారులు.. రావులపాలెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నిక సిబ్బందికి మార్గనిర్దేశనం చేశారు. ఎన్నికల సామగ్రితో సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.