తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామి దర్శనానికి హాజరయ్యే భక్తుల రద్దీ దృష్ట్యా ఈవో త్రినాథరావు దేవస్థానంలోని అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. వ్రతాల నిర్వహణ.. భద్రత.. రవాణా ఏర్పాట్లపై చర్చించారు.
అన్నవరంలో కార్తీక మాసానికి ఏర్పాట్లు - arrangements for karthika masam
కార్తీక మాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆలయ ఈవో త్రినాథరావు అధికారులతో సమీక్షించారు.
అన్నవరంలో కార్తీక మాసానికి ఏర్పాట్లు
ఇదీ చూడండి: అన్నవరంలో దసరా ఉత్సవాల సందడి