తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తులకు విక్రయించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. లాక్డౌన్ ఈ నెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ఆలయంలో భక్తులను అనుమతించట్లేదు.
సత్యదేవుని ప్రసాదం అమ్మేందుకు అధికారుల ఏర్పాట్లు - అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తులకు విక్రయించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నమునాలయం వద్ద ప్రసాదం విక్రయాలు జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సత్యదేవుని ప్రసాదం
తిరుపతిలో మాదిరిగా సత్యదేవుని ప్రసాదాన్ని నమునాలయం వద్ద విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దేవాదాయ కమిషనర్‌కు నివేదిక పంపామని ఈవో త్రినాథరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నమునాలయం వద్ద ప్రసాదం టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ప్రసాదం అమ్మకాలు ప్రారంభించే అవకాశం ఉంది.