లాక్ డౌన్ పుణ్యమా అని మనలోనూ, సమాజంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. బళ్లు ఓడలు... ఓడలు బళ్లు అయ్యాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాత్రం బస్సు... లారీ అవతారమెత్తింది. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే బస్సు... సామగ్రి చేరవేసే లారీలా మారిపోయింది.
లారీ కాదిది బస్సు... అదిరింది దీని లుక్కు..! - bus converted to lorry in amalapuram
ముందు టర్నింగ్ ఇస్తే ఆర్టీసీ బస్సు లుక్. వెనక టర్నింగ్ ఇస్తే సరకులు మోసే లారీ లుక్. మరి లెఫ్ట్ టర్నింగ్ ఇస్తే రెండూ కలిపి కనిపిస్తాయి. ఎంటీ వెరైటీ వాహనం అనుకుంటున్నారా..? దీని గురించి తెలుసుకోవాలంటే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాల్సిందే.
లారీ అవతారమెత్తిన బస్సు
స్థానికంగా గ్యారేజ్‌లో పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది లారీ లాంటి బస్సును తయారు చేశారు. దీనిని చేయడానికి సుమారు రూ.70వేలు ఖర్చయ్యిందని ఆర్టీసీ డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అమలాపురంలో బస్సును లారీగా తయారు చేశామన్నారు. దీనిపై ఎత్తైన లోడును కూడా రవాణా చేసేందుకు వీలుంటుంది.
ఇదీ చదవండి: నాబార్డు చైర్మన్‌గా చింతాల గోవిందరాజులు నియామకం