తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంలో మూడు డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక వాహనాన్ని సిద్దం చేస్తున్నట్లు వివరించారు. బ్యాచ్‌కు 16 మంది చొప్పున 32 రోజులపాటు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం దృష్ట్యా ఏసీ బస్సులతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను తగ్గించామని తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నామని అన్నారు.
జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి మూడు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు - rtc driving schools started at east godavari
ఏప్రిల్ 1 నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంలో మూడు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోన్నట్లు ఆర్ఎం నాగేశ్వరరావు తెలిపారు.
ఆర్టీసీ ఆర్ఎం నాగేశ్వరరావు