ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీఎన్జీఓ ఆందోళన

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్​ వద్ద ఏపీఎన్జీఓలు ఆందోళనకు దిగారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్సీ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని కోరారు.

APNGO agitation  in east Godavari
తూర్పుగోదావరిలో ఏపీఎన్జీఓ ఆందోళన

By

Published : Sep 29, 2020, 7:54 PM IST

ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య(ఏఐఎస్​జీఈఎఫ్) డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఏఐఎస్​జీఈఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ ఎన్​జీఓలు ఆందోళన చేపట్టారు. సీపీఎస్ విధానం, పీఎఫ్‌, ఆర్‌డీఏ బిల్లును రద్దు చేయాలన్నారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్‌ చేసి, ఖాళీ పోస్టుల భర్తీపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్లకొకసారి పీఆర్సీ (వేతన సవరణ కమిషన్) వేసి నిధులు విడుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

కరోనా వేళ.. వేతనాలకు కటకట

ABOUT THE AUTHOR

...view details