ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

APGEA Secretary: 'సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతాం'

ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వరరావులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం-ఏపీజీఈఏ ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాల్ని ప్రభుత్వం ఆహ్వానించాలని...కేవలం ఎన్జీవో సంఘం, అమరావతి ఉద్యోగ ఐకాసలను మాత్రమే ఎందుకు ఆహ్వానించారో సమాధానం చెప్పాలని రాజమహేంద్రవరంలో అన్నారు.

మాట్లాడుతున్న ఆస్కారరావు
మాట్లాడుతున్న ఆస్కారరావు

By

Published : Oct 13, 2021, 3:51 PM IST

ఉద్యోగ సంఘాల ఐకాస నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వరరావులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ప్రధాన కార్యదర్శి ఆస్కారరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాల్ని ప్రభుత్వం ఆహ్వానించాలని...కేవలం ఎన్జీవో సంఘం, అమరావతి ఉద్యోగ ఐకాసలను మాత్రమే ఎందుకు ఆహ్వానించారో సమాధానం చెప్పాలని రాజమహేంద్రవరంలో అన్నారు. వీరిని ప్రభుత్వం ఆహ్వానించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జలకు వినతులు సమర్పించి..తమను ప్రభుత్వం ఆహ్వానించిందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.

రెండు ఐకాసల కలయిక అభ్యంతరకరమైనదని...కామెడీగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండేళ్లుగా తాము ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నామని..సీపీఎస్ రద్దు సహా ఏ సమస్యా పరిష్కారం అవ్వలేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని..జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నామని.. పరిష్కరించకుంటే జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం ఉద్యమం చేపడుతుందని చెప్పారు.

ఇదీచదవండి:

సన్నపన తిరుమంజనం సేవకు ప్రత్యేక ఏర్పాట్లు..

ABOUT THE AUTHOR

...view details