ETV Bharat / state
AP TOPNEWS ప్రధానవార్తలు @9am - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
..
ప్రధానవార్తలు 9am
By
Published : Jan 2, 2023, 8:59 AM IST
| Updated : Jan 2, 2023, 12:44 PM IST
- ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల ఆకలి తిప్పలు..పట్టించుకోని అధికారులు
Patients Suffering from hunger in AP Govt Hospitals: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, మండలాల్లో వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని పలువురు రోగులు ఆవేదన చెందారు. ఏదైనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరితే.. చికిత్స ఉచితమైనా ఆహార ఖర్చు మాత్రం తడిసిమోపెడు అవుతుందని వాపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikuntha Ekadashi Celebrations: వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూగజీవాలకు నరకం చూపిస్తున్న.. లంపీ స్కిన్ వైరస్
Lumpy Skin Disease: రాష్ట్రంలో మూగజీవాలకు పెద్దకష్టం వచ్చి పడింది. లంపీ స్కిన్ అనే పిలిచే ముద్దచర్మ వ్యాధితో మూగజీవాలకు నరకయాతన అనుభవిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పాల ఉత్పత్తిపైనా ప్రభావం చూపించి.. రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. వ్యాధి విస్తరిస్తున్నా.. యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే అంటూ దాటవేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి..
Tragedy at Uyyur Program in Guntur: గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన పేదలకు కానుకల పంపిణీ తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందటంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. తొక్కిసలాటలో మహిళలు చనిపోవడం తనను కలచివేసిందన్న సీఎం జగన్.. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉగ్రవాదుల లక్షిత దాడి.. నలుగురు మృతి.. ఆరుగురికి గాయాలు
కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీ జిల్లాలో ఇళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పౌరులు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మైనర్ కుమార్తెపై పెద్దనాన్న అత్యాచారం.. పోలీసుల భయంతో పరార్!
మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. మర్మాంగాల్లో నొప్పి భరించలేక బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం పోలీసులను ఆశ్రయించారు బాధితులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్.. రిపబ్లికన్ల మద్దతు లేకున్నా ముందుకే..
అధ్యక్ష పదవికి మరోసారి పోటీ చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్లు వ్యతిరేకించినా ఈ విషయంలో ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. తృతీయపక్ష అభ్యర్థిగానైనా పోటీ చేయాలని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్లో ఎంతంటే?
2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఓపెనర్‌గా రాహుల్ వద్దు.. ఇషాన్ కిషన్‌కు అవకాశమివ్వండి'.. గంభీర్ సలహా
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఓపెనర్‌గా ఆడించడాన్ని తప్పుబట్టాడు. అతడి ప్లేస్‌లో మరో యువ క్రికెటర్‌ను ఆడించాలని సూచించాడు. ఇంకా ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మాస్ మొగుడు వీరసింహారెడ్డి ట్రైలర్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ లుక్‌లో అమిగోస్
బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగా చిత్ర బృందం ఈ నెల 6న ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నారు. మరోవైపు, కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మూవీ 'అమిగోస్' ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా కొత్త ట్రైలర్‌ను రిలీజ్ చేసింది ఈ చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Last Updated : Jan 2, 2023, 12:44 PM IST