ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

..

9am topnews
ప్రధానవార్తలు9am

By

Published : Dec 24, 2022, 8:59 AM IST

  • ఒక్కో రైతుపై రూ.2.45 లక్షల అప్పు.. దేశంలో ఏపీనే టాప్​​..!
    రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 2 లక్షల 45 వేల అప్పుల భారం ఉంది. జాతీయ సగటుతో పోలిస్తే ఇది మూడింతలు అధికం. సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఒక్కో రైతు కుటుంబం లక్షా 52వేల రుణభారంతో.. దేశంలో ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భాష పరిరక్షణకు తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలి: జస్టిస్ ఎన్​వీ.రమణ
    భాష, సంస్కృతి, ఆహార వ్యవహారాల పరిరక్షణ విషయంలో.. తమిళుల నుంచి తెలుగువారు నేర్చుకోవాల్సింది, స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉందని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ.రమణ అన్నారు. తెలుగు భాషకు పట్టిన ఆంగ్ల జ్వరాన్ని.. పద్యమనే ఆయుధంతో విడిపించాలని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సూచించారు. పాలపుంత భాషగా, ఇతరులు నిత్యం కొత్త భాషగా మెచ్చే తెలుగు.. మనవారికి పనికిరాని భాషగా మారుతోందంటూ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆవేదన వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వాడీవేడిగా నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం.. వైసీపీ ఎమ్మెల్యేల నిరసన గళం
    అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లుగా ప్రజారంజక పాలన అందిస్తున్నామని.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నాయకులు తరచూ ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నమని.. అధికార వైసీపీ ప్రజాప్రతినిధులే అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా ఒక్క పనీ జరగడం లేదని.. నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం వేదికగా ఆక్రోశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బాపట్ల ఆర్టీసీ డీఎంపై అధికారుల చర్యలు..
    ఆర్టీసీ స్థలంలో వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాసరెడ్డిపై వేటు పడింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి అడ్డుతగిలారన్న కారణంతోనే ఆయనపై వేటు పడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పేదలకు కేంద్రం గుడ్​న్యూస్.. ఏడాది పాటు ఫ్రీ రేషన్
    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలందరికీ ఏడాదిపాటు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏడాదికి అయ్యే దాదాపు రూ.2 లక్షల కోట్ల భారాన్ని కేంద్రమే భరించనుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • శబరిమల యాత్రలో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది భక్తులు మృతి
    కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చైనాలో రోజుకి 3.7కోట్ల కరోనా పాజిటివ్‌ కేసులు! ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా..!
    చైనాలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబరు చివరి వారంలో రోజుకు 3.7కోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండున్నర గంటల ఛార్జింగ్‌ చేస్తే చాలు.. 500 కి.మీ దూరం ప్రయాణం!
    ఒకసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ వెళ్లే అధునాతన ఏసీ విద్యుత్తు బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అభివృద్ధి చేసింది. తొలితరం విద్యుత్​ బస్సులు అయితే.. దాదాపుగా 3-4 గంటలు ఛార్జింగ్​ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించేవి. కానీ సాంకేతికత వృద్ధి చెందడం వల్ల రెండున్నర గంటలు ఛార్జింగ్​ చేస్తే చాలు. ఆ వివరాలేంటో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కె.వి.ప్రదీప్‌ మాటల్లోనే తెలుసుకోండి మరి..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరన్‌కు ఎందుకంత భారీ మొత్తం..? పంజాబ్‌ సహ యజమాని సమాధానమిదే..!
    టీ20 ప్రపంచకప్‌ ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఇంగ్లాండ్‌ ఆటగాడు శామ్‌ కరన్‌ ఐపీఎల్ మినీ వేలంలో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను సొంతం చేసుకొన్న ఆటగాడిగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మళ్లీ యాంకర్​ అనసూయకు ఏమైంది ఇన్​స్టా పోస్ట్​కు అర్థమేంటి
    యాంకర్స్ అంటే ఎప్పుడు జోష్​గా కలర్​ఫుల్​గా కనిపిస్తుంటారు. వాళ్లకీ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ప్రేక్షకుల్ని ప్రతి క్షణం ఎంటర్​టైన్ చేయడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్లు కూడా మన లాగే సాధారణమైన జీవితాన్ని గడుపుతుంటారు. అంతే గాక ఎమోషనల్​ అయినప్పుడు బాధపడుతుంటారు. సందర్భం వచ్చినప్పుడు బయటపడతారు. అలాంటి సమయంలోనే వాళ్లకు ఏం జరిగిందో అని అభిమానులు హైరానా పడిపోతుంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్​గా ఉండే అనసూయ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఇప్పుడా ఆ పోస్ట్​ సోషల్​మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details