తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట పోలీస్ స్టేషన్ల సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, మందుల కిట్లను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అందించారు. గోపాలపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో సిఐ వి.కృష్ణ, ఎస్సైలు బుజ్జి బాబు, శీను నాయక్, శివప్రసాద్లకు వీటిని అందించారు. పోలీసులు.. కరోనా కాలంలో విలువైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు.
పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - ఏపీ న్యూస్ అప్డేట్స్
కరోనా నియంత్రణ దృష్ట్యా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పరిధిలోని నాలుగు పోలీస్టేషన్లలో సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, మందుల కిట్లను అందించారు.
police