కరోనాతో బాధపడుతున్న రోగికి అత్యవసర సమయంలో ప్లాస్మా దానం చేసి ఆదుకున్నారు తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక కమిషనర్ ప్రసాద్‌రాజు . టీకా వేయించుకుని 45 రోజులు గడవడంతో ఓ పాజిటివ్ గ్రూప్ ప్లాస్మా కోసం అన్వేషిస్తున్న వైద్యులు.. కమిషనర్‌ను సంప్రదించారు. ఆయన అంగీకరించడంతో ప్లాస్మా సేకరించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మరో ఇద్దరు వార్డు వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శి కూడా ప్లాస్మా దానం చేసి మరి కొందరు రోగులను ఆదుకున్నారు.
అత్యవసర సమయంలో ప్లాస్మా దానం.. - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
కరోనా మహమ్మారితో ప్రజలు పోరాడుతున్నారు. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో పరిస్థితి దారుణంగా మారింది. అయితే కరోనాతో పోరాడుతున్న రోగులకు కొందరు అత్యవసర సమయంలో ప్లాస్మా దానం చేసి ఆదుకుంటున్నారు.
plasma donate