ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటల బీమాకు ప్రత్యేక కంపెనీ పెడుతున్నాం: మంత్రి కన్నబాబు

రైతులకు పంటల బీమా పరిహారాన్ని మరింత వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ఇప్పుడున్న బీమా కంపెనీలు నిబంధనల పేరిట రైతులకు పూర్తి న్యాయం చేయకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించామన్నారు.

By

Published : Nov 25, 2020, 6:45 AM IST

minister kannababu
minister kannababu

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి కురసాల కన్నబాబు పర్యటించారు. జూన్‌ నుంచి అక్టోబరు వరకు అధిక వర్షాలు, వరదలతో ఖరీఫ్‌ పంటలకు నష్టం జరిగిందన్నారు. పంట నష్ట పరిహారానికి సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే పరిహారం అందించాలని ఆదేశించారని వెల్లడించారు. కేంద్రం పెట్టుబడి రాయితీ నిధులను అందించేవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రైతులకు సాయం చేసేది కాదన్నారు.

ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికే రూ.277.67 కోట్లను విడుదల చేశారని చెప్పారు. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తోందన్న మంత్రి... ఈ-క్రాప్‌లో నమోదైతే తక్షణం బీమా వర్తించే విధానం తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రైతులకు పంటల బీమా పరిహారాన్ని మరింత వేగంగా అందించేందుకు ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details