రాజధాని వికేంద్రీకరణ బిల్లును దొడ్డి దారిన గవర్నర్తో ఆమోదింపజేశారని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో మాట్లాడిన ఆయన...మొదటిసారి వికేంద్రీకరణ బిల్లు మండలికి వచ్చినప్పుడు సెలక్ట్ కమిటీకి పంపామని గుర్తు చేశారు. రెండోసారి చర్చకు రానివ్వకుండా రూల్ 90 ద్వారా మండలిలో అడ్డుకున్నారని చెప్పారు. దొడ్డి దారిన ఇలా ఆమోదముద్ర వేసి చట్టం చేసుకోవడం హేయమైన చర్యని...దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల మేనిఫెస్టోలో మూడు రాజధానుల ప్రస్తావించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
'దొడ్డి దారిన గవర్నర్తో ఆమోదముద్ర వేయించటం హేయమైన చర్య' - three capitals for ap
రాజధాని వికేంద్రీకరణ బిల్లును దొడ్డి దారిన గవర్నర్తో ఆమోదింపజేసుకోవడం హేయమైన చర్యని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
council deputy chairman