ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుని ఘటనలో మరికొన్ని కేసులు ఎత్తివేత - తుని ఘటనలో కేసులు ఎత్తివేత వార్తలు

కాపు ఉద్యమానికి సంబంధించిన మరికొన్ని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 17 కేసుల్లో విచారణ ఉపసంహరించుకుంటూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

tuni incident
tuni incident

By

Published : Jul 27, 2020, 8:44 PM IST

కాపు ఉద్యమంలో చెలరేగిన హింస వల్ల నమోదైన మరికొన్ని కేసులను వైకాపా ప్రభుత్వం ఎత్తివేసింది. తూర్పుగోదావరి జిల్లాలో తుని రైలు దగ్ధం ఘటనలో మరో 17 కేసుల్లో విచారణ ఉపసంహరించుకుంది.

తుని రూరల్ పీఎస్‌లో నమోదైన 17 కేసులను ఉపసంహరిస్తున్నట్టు హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్​ సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు హోంశాఖ పేర్కొంది. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించి నమోదైన 69 కేసులకుగాను ఇప్పటికే 51 కేసులను ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details