కోన ప్రాంత ప్రజల డిమాండ్ల పరిష్కారానికి దివిస్ యాజమాన్యం అంగీకరించిందంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. స్థానికులపై పెట్టిన క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కేసులను తొలగిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేయలేదు. సంస్థను వేరొక ప్రాంతానికి తరలించటానికి అంగీకరించలేదు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల రొయ్యల వ్యాపారం దెబ్బతిని యువత ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వం ఈ సమస్యలపై చర్చలకు రావాలి.. సంస్థ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే జగన్ కుటుంబం కోన భూములపై కన్నేసింది. ఇందులో భాగంగానే బినామీ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వీటి వల్ల సముద్ర జలాలు కలుషితమవుతాయి- యనమల రామకృష్ణుడు, శాసన మండలిలో ప్రతిపక్ష నేత