ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు - ap fishermans return from gujarat

గుజరాత్​లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు 4 వేల మంది మత్స్యకారులు 54 బస్సుల్లో గుజరాత్ నుంచి బయలుదేరారు. వారిలో శుక్రవారం నాటికి సుమారు 1000 మంది మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి చేరుకున్నారు.

గుజరాత్​ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు
గుజరాత్​ నుంచి స్వస్థలాలకు మత్స్యకారులు

By

Published : May 2, 2020, 12:08 AM IST

లాక్ డౌన్ కారణంగా గత 40 రోజులుగా గుజరాత్ లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన సుమారు 4 వేల మంది మత్స్యకారులు 54 బస్సుల్లో గుజరాత్ నుంచి బయలుదేరారు. వారిలో శుక్రవారం నాటికి సుమారు 1000 మంది మత్స్యకారులు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి అక్కడి అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ మత్స్యకారులకు మాస్కులు అందజేశారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... భౌతిక దూరం పాటించాలని... సాధ్యమైనంత వరకూ ఇళ్లకే పరిమితమై ఉండాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details