తూర్పుగోదావరి జిల్లా ఎండపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు చంద్రరావు రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. అతని భార్య ఆస్పత్రికి తీసుకురాగా వైద్యపరీక్షలు చేసే లోపే ఆయన మృతి చెందారు. ఆసుపత్రి ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాదాపు ఆరుగంటల పాటు సాయం కోసం ఎదురు చూసినా ఎవరి మనసూ కరగలేదు. చివరకు మృతుని కుమారుడు స్వగ్రామం తీసుకెళ్లేందుకు వాహనాల కోసం అన్ని విధాలా ప్రయత్నించాడు. ఏ వాహనదారుడు కూడా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సాహసించలేదు. ఎట్టకేలకు పిఠాపురంలోని ప్రైవేట్ అంబులెన్స్‌ను తీసుకొచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
అమానుషం.. అనాథలా మృతదేహం.. - తూర్పుగోదావరి జిల్లా కరోనా వార్తలు
కరోనా కారణంగా మానవత్వం మాయమవుతోంది.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆసుపత్రి ద్వారంలో సుమారు ఆరు గంటల పాటు మృతదేహం పడి ఉన్నా తీసుకెళ్లేందుకు ఎవరూ సహకరించలేదు.

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకురాని వైనం
మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకురాని వైనం