తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో అంపన్ తుపాన్ ధాటికి ఓ ఇల్లు నేల కూలింది. ఆ ఇంటి గోడ నుంచి పురాతన నాణేలు బయటపడటంతో, స్థానికులు వాటిని దక్కించుకోవటానికి పోటీపడ్డారు. ఒక్కొక్కరికి 10 నుంచి 15 నాణేలు దొరకటంతో విషయాన్ని బయటకి రానివ్వలేదు. చివరికి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం తెలియటంతో కోనపాపపేటకు చేరుకొని నాణేలు తీసుకున్న వారి వివరాలు సేకరించారు. అనంతరం వారి నుంచి నాణేలు స్వాధీనం చేసుకున్నారు. మెుత్తం ఎన్ని నాణేలు దొరికాయో, అవి ఏ కాలానికి చెందినవనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కూలిన ఇంటి గోడ... పురాతన నాణేలు లభ్యం! - silver coins in konpapapeta news
తుపాన్ ధాటికి ఇంటి గోడ కూలటంతో... పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని చేజిక్కించుకోవటానికి స్థానికులు పోటీపడ్డారు. ఒక్కొక్కరికీ 10 నుంచి 15 నాణేలు దొరకటంతో విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. చివరికి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలియటంతో కొన్ని నాణేలు సేకరించారు.
![కూలిన ఇంటి గోడ... పురాతన నాణేలు లభ్యం! antique silver coins in konapapapeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7299477-187-7299477-1590127011464.jpg)
కూలిన ఇంటి గోడలో పురాతన నాణేలు
ఆ కూలిన ఇళ్లు అమ్మోరి అనే వ్యక్తికి చెందినదనీ, అప్పట్లో ఆయనకు ఆస్తి ఎక్కువగా ఉండటంతో... నాణేలు ఇంటి గోడల్లో భద్రపరిచి ఉంటాడని స్థానికులు వివరిస్తున్నారు.
ఇదీ చదవండి:అలసిపోయిన పాదాలు.. బరువెక్కిన గుండెలు!