ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2020, 12:13 PM IST

ETV Bharat / state

అదనపు వైద్య ఆరోగ్య శాఖలో 'అనిశా' తనిఖీలు

అనిశా అధికారులు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ వైజర్​గా పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్లు సీఐ సూర్య మోహన్​రావు తెలిపారు. ఈ తనిఖీల్లో అనిశా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

anti corruption bureau Checks
అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అనిశా తనిఖీలు

అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అనిశా తనిఖీలు

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని అదనపు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం రాత్రి అనిశా అధికారులు దాడులు జరిపారు. రాజమహేంద్రవరం ఏసీబీ సీఐ సూర్య మోహనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ముందుగా నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం రంపచోడవరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో దస్త్రాలను పరిశీలించారు. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ వైజర్​గా పని చేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్లు సీఐ సూర్య మోహన్​రావు తెలిపారు. తనకు రావలసిన ఆరు నెలల ఇంక్రిమెంట్లు, జీతాల చెల్లించాలంటే.. యూడీసీగా పనిచేస్తున్న జాకబ్​, ఏడీఎంహెచ్ఓ రాజ్ కుమార్​లు డబ్బులు డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెల్లడించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details