తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన రథానికి రెండోసారి అధికారులు ట్రయల్ రన్ నిర్వహంచారు. ముక్కోటి ఏకాదశి రోజున తొలిసారిగా ట్రయల్ రన్ చేసిన అధికారులు.. ఆదివారం రెండోసారి రథం సామర్థ్యాన్ని పరీక్షించారు. గతేడాది సెప్టెంబర్ 5న రథం దగ్ధమైన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. కోటీ పది లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం కొత్త రథాన్ని నిర్మించింది. వచ్చే నెల 19 నుంచి 28 వరకూ నిర్వహించబోయే స్వామివారి కల్యాణోత్సవానికి... దీన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు.
అంతర్వేది ఆలయ నూతన రథం రెండోసారి ట్రయల్ రన్ - అంతర్వేది ఆలయం తాజా వార్తలు
అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ నూతన రథానికి రెండోసారి అధికారులు ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు తెలిపారు.
అంతర్వేదిలో రథం ట్రయల్ రన్