ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ANTARVEDI: ముందుకొస్తున్న సముద్రం.. భయాందోళనలో గ్రామస్థులు - antharvedhi latest news

ప్రశాంతంగా ఉండాల్సిన సాగర తీరం భీకరంగా మారుతోంది. అలల హోరుతో నిశ్చలంగా ఉండాల్సిన ఆ తీరంలో ఆలజడి రేగుతోంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సంద్రం ముందుకు చొచ్చుకురావడం ఆందోళన కలిగిస్తోంది.

అంతర్వేదిలో సముద్రం అలజడి
అంతర్వేదిలో సముద్రం అలజడి

By

Published : Aug 10, 2021, 6:10 PM IST

అంతర్వేదిలో సముద్రం అలజడి

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్రం అలజడి రేపుతోంది. రెండు రోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకుని వస్త్తోంది. అలలు తాకిడికి తీరానికి 25 మీటర్ల దూరంలో ఉన్న రెసిడెన్షియల్ భవనం పాక్షికంగా ధ్వంసం అయింది. రూ.70 లక్షలతో నిర్మించిన 9 గదుల రెసిడెన్షియల్ భవనం ప్రహరీ, రెండు దుకాణాలు కొట్టుకుపోయాయి. గత రెండు రోజులుగా సముద్రం ఉద్ధృతంగా ఉందని, ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details