ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుష్కరకాలంగా రాములోరి తరుపున సీతమ్మకు కంత - రాములోరి తరుపున సీతమ్మకు కంత తయారీ వార్తలు

శ్రీరామ నవమి వచ్చిందంటే చాలు.. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం గ్రామంలోని ఆ ఇంటిలో నెల రోజులు ముందుగానే పెళ్లి సందడి నెలకొంటుంది. 120 రకాల ఆకృతులతో.. పాలకోవా పిండివంటలు తయారు చేయడంలో.. చుట్టుపక్కలవారంతా మునిగిపోతారు. 12 ఏళ్లుగా రాములోరి తరుపున సీతామ్మకు కంతను తయారు చేస్తున్నారు పేరిచర్ల సత్యవాణి.

antha prepaired to sriramanavami
రాములోరి తరుపున సీతమ్మకు కంత

By

Published : Apr 18, 2021, 12:54 PM IST


శ్రీరామనవమి.. సీతారాముల కళ్యాణం అంటే అందరికీ సందడే. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం గ్రామానికి చెందిన పేరిచర్ల సత్యవాణి ఇంటిలో మాత్రం.. శ్రీరామనవమికి నెల రోజులు ముందుగానే ఏర్పాట్లు మొదలవుతాయి. పుష్కరకాలంగా రాములోరి సేవలో పరితపిస్తున్న సత్యవేణి.. ఏటా శ్రీరామనవమి నాడు ఆమే స్వయంగా తయారు చేసిన కంతను.. వరుడు శ్రీరాముడు తరఫున వధువు సీతాదేవికి కళ్యాణ ఘట్టంలో అందజేస్తారు. ఇందుకోసం పాలకోవాతో ప్రత్యేకంగా కంత తయారుచేస్తారు. ఇరవై రోజుల ముందు నుంచే ఘుమఘుమలాడే పాలకోవాతో వివిధ ఆకృతులతో 120 రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. శ్రీ రామనవమికి పి.గన్నవరంలోని శ్రీ పట్టాభి రామాలయం వద్ద నిర్వహించే రాముల వారి కళ్యాణానికి అందజేస్తారు. కళ్యాణం అనంతరం కంతలోని పదార్థాలను ఆమె భక్తులకు పంచిపెడతారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details