తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన రథం నిర్మాణ పనులు మొదలయ్యాయి. గత నెల 5వ తేదీ అర్ధరాత్రి స్వామివారి రథం దగ్ధం కావటం.. తదుపరి ఆందోళనలు చేపట్టడం వంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27న రథం పనులను రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. అయితే పనులు మొదలు పెట్టలేదు. రథం నిర్మాణానికి అవసరమైన 1300 ఘనపుటడుగుల కలపను సిద్ధం చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన వడ్రంగి పనివారితో పనులు మొదలు పెట్టినట్లు దేవాదాయ శాఖ ఏడీసీ రామచంద్ర మోహన్ వెల్లడించారు. 3 నెలల వ్యవధిలో రథం సర్వాంగ సుందరంగా తయారవుతుందని ఆయన స్పష్టం చేశారు.
అంతర్వేదిలో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం - Antarvedi latest news
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి నూతన రథం నిర్మాణ పనులు మొదలయ్యాయి. గత నెల 27న రథం పనులను రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించారు.
అంతర్వేదిలో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం