RSS Chief Mohan Bhagwat tour in east godavari: తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా.. సఖినేటిపల్లి మండలం వీవీ మెరక సత్యనారాయణరాజుపురంలోని స్థానికులు, నిర్వాహకులతో.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కాసేపు ముచ్చటించారు. అంతర్వేది ప్రాంతం సుందరంగా ఉందని, ఈ పర్యటన తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
ఇక్కడి ప్రజల స్నేహ సంబంధాలు, ఆప్యాయత మరువలేమని కొనియాడారు. ఇదే స్వచ్ఛ ధర్మాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. మరోసారి పర్యటనకు వచ్చినప్పుడు.. అందరితో మరింత ఎక్కువ సమయం గడుపుతానని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన ముగియడంతో.. ఇవాళ దిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.