రాష్ట్రంలో జల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచేందుకు సీలేరు వద్ద అదనంగా విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పాలన అనుమతులు మంజూరు చేసింది. 115 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను సీలేరు వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 510 కోట్లు ఖర్చు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీలేరు జల విద్యుత్ కేంద్రానికి అదనంగా మరో 2 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఏపీ జెన్కో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనుంది.