ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో మృతదేహం లభ్యం.. తేలని 14 మంది ఆచూకీ - గోదావరి బోటు ప్రమాదం

పడవ ప్రమాదంలో మరో మృత దేహం లభ్యమైంది. ఇంకో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

boat

By

Published : Sep 22, 2019, 9:25 AM IST

Updated : Sep 22, 2019, 12:06 PM IST

తూర్పు గోదావరి జిల్లా పడవ ప్రమాదానికి సంబంధించి.. ఓ మహిళ మృత దేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సహాయ సిబ్బంది... ఒడ్డుకు చేర్చారు. తాజా ఘటనతో.. ఇప్పటివరకూ 37 మృతదేహాలు లభ్యమైనట్టైంది. మరో 14 మంది ఆచూకీ తేలాల్సి ఉంది. 26 మంది క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం.. కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Sep 22, 2019, 12:06 PM IST

ABOUT THE AUTHOR

...view details