అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం వద్ద గురువారం సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి ఒక మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమవ్వగా... మరో మృతదేహం శుక్రవారం లభించింది. మృతి చెందిన వ్యక్తులు డేవిడ్ రాజు, సత్యసాయిబాబా అని గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
గల్లంతైన వారిలో మరో యువకుడి మృతదేహం లభ్యం - ఎస్ యానాంలో యువకుడు గల్లంతు తాజా వార్తలు
సముద్ర స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు అలల ఉద్ధృతికి గురువారం సాయంత్రం గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం ఒకరి మృతదేహం లభ్యం కాగా.. శుక్రవారం మరో మృతదేహం దొరికింది.

మరో యువకుడి మృత దేహం లభ్యం